Mobile Popup Ad
Mobile Popup Ad

గాంధీభవన్‌లో రసాభాస.. మంత్రుల సమక్షంలోనే గొడవ

కలం, వెబ్ డెస్క్: గాంధీభవన్‌లో (Gandhi Bhavan) మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రుల పక్కన కూర్చునే అంశంలో ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఇన్‌ఛార్జి ఉస్మాన్‌ ఆల్‌ హాజ్రీల మధ్య గొడవ జరిగింది. చివరికి ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకునే స్థాయికి వెళ్లారు.

ఈ తోపులాటలో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోయినట్లు సమాచారం. ఇద్దరిని అడ్డుకునేందుకు ప్రభుత్వ సలహాదారు వీహెచ్ (Hanumantha Rao) సైతం ప్రయత్నించగా.. ఆయన్ను సైతం పక్కకు తోసివేసేందుకు యత్నించారు. మంత్రులు వారించినా.. ఎవరూ తగ్గకపోవడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి గాంధీ భవన్ (Gandhi Bhavan) నుంచి వెళ్లిపోయారు. అనంతరం, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఇరు పక్షాలకు నచ్చజెప్పి వారిని అక్కడి నుంచి పంపించేశారు. సాక్షాత్తూ మంత్రుల సమక్షంలోనే ఇలా జరగడంతో ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఆల హాజ్రీ మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి.

Read Also: రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ.. కేసీఆర్‌కు కొత్త చిక్కులు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>