పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఘర్షణలు.. ఓటింగ్ నిలిపివేత!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ (AP Panchayat Elections) సందర్భంగా గురువారం పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నాయకులు, ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి వెళ్లనివ్వకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని, అధికార పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వైసీపీ మద్దతుదారులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న డీఎస్పీ, సీఐలపై కొందరు మహిళలు తిరగబడి దాడికి యత్నించడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

మరోవైపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నె పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. వైసీపీ మద్దతుదారులు రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో మాటామాటా పెరిగి పరస్పర దాడులకు దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కారంపొడి, కారం నీళ్లు చల్లుకోవడంతో పోలింగ్ బూత్ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఎన్నికల అధికారులు వెంటనే అప్రమత్తమై పోలింగ్ కేంద్రానికి తాళాలు వేసి, ఓటింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>