స్మగ్లర్ల వేటలో నదిలో గల్లంతు.. బీఎస్ఎఫ్ జవాన్ మృతి

కలం, వెబ్ డెస్క్: అసోంలో పశువుల స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కడిమి వేణు(Kadimi Venu) ప్రాణాలు కోల్పోయాడు. అసోంలోని కాచార్ జిల్లాలో ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వేణు.. బరాక్ నదిలో స్మగ్లర్ల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు నదిలోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

దాదాపు రెండు రోజుల గాలింపు తర్వాత సుమారు 25 కిలోమీటర్ల దిగువన కుషియారా నదిలో వేణు మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవాడు. దేశ సరిహద్దుల రక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>