కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు సంబంధించి సమగ్ర షెడ్యూల్ విడుదలయింది. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల పాలకవర్గాలను ఎన్నుకోనున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ ముందస్తుగా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 7న మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ 20న పోలింగ్ నిర్వహిస్తారు. వీటి ఫలితాలు సెప్టెంబర్ 23న వెల్లడవుతాయి.
అనంతరం ZPTC, MPTC ఎన్నికల నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 28న జారీ చేస్తారు. ఈ స్థానాలకు అక్టోబర్ 11న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 14న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక చివరి దశలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 19న పంచాయతీ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల కానుండగా, అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించి అదే రోజున లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికల (Local Body Elections) ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత నవంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థలు తమ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించనున్నాయి.
Also Read : బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్
Follow Us On: X(Twitter)

