కలం, వెబ్ డెస్క్ : విజయవాడ కనకదుర్గమ్మ (Vijayawada Durga Temple) భక్తులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దశాబ్ధం తరువాత ఇంద్రకీలాద్రికి మహర్దశ వచ్చింది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద సదనం, మహాప్రసాద భవనం ప్రారంభం కానుంది. భక్తులకు మరింత మెరుగైన అన్నప్రసాద సేవలు అందించేందుకు ఈ భవనాలను నిర్మించారు.
అన్నప్రసాద సదనంలో ఒకే విడతలో 800 మంది భక్తులు భోజనం చేసేలా సదుపాయాలను కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భోజన వసతి, వంట, పంపిణీ తదితర ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా, భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాదం తయారు చేయడానికి ఆటోమేటిక్ వంటశాలలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో వంట ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు, అధిక సంఖ్యలో భక్తులకు సమర్థంగా అన్నప్రసాదం అందించే అవకాశం ఉంటుంది.
Also Read : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల!
Follow Us On : WhatsApp

