Mobile Popup Ad
Mobile Popup Ad

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నియామకాల పరీక్ష తేదీలు ఖరారు

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(FSL)లో జరుగుతున్న డైరెక్ట్ రిక్రూట్‌మెంట్  (Recruitment) ప్రక్రియలో భాగంగా రాత పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ మేర‌కు టీఎస్ఆర్పీఆర్బీ చైర్మ‌న్ వీవీ శ్రీనివాస రావు వివ‌రాలు వెల్లడించారు.

జనవరి 20 నుంచి 31 వరకు నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మొత్తం 4,664 మంది అభ్యర్థుల్లో 3,760 మంది హాజరయ్యారు. అనంతరం నిబంధనల ప్రకారం డేటా పరిశీలన, ఫిల్ట‌ర్‌ ప్రక్రియను బోర్డు పూర్తి చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ప్రతి పోస్టుకు 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను రాత పరీక్షలకు షార్ట్ లిస్ట్ చేశారు. పోస్టుల వారీగా కట్‌ఆఫ్ మార్కులు, ఎంపికైన అభ్యర్థుల వివరాలు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

రాత పరీక్ష తేదీలు

రాత పరీక్షలు మార్చి 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ప్రతి టెక్నికల్ పేపర్‌కు ఒక గంట సమయం ఉంటుంది. పరీక్ష మధ్యలో బయటకు వెళ్లేందుకు అనుమతి ఉండదు. మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు సుమారు 100 పదాల్లో సంక్షిప్త సమాధానం రాయాలి. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తప్పనిసరి. మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వెయిటేజీ ప్రకారం మెరిట్ లెక్కిస్తారు.

క్లారిఫికేషన్లకు అవకాశం

రాత పరీక్షలకు అర్హత రాలేదని భావిస్తున్న అభ్యర్థులు ఫిబ్రవరి 18న‌ ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 21 ఉదయం 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో క్లారిఫికేషన్ కోరవచ్చు. ప్రతి పోస్టుకు రూ.500 చెల్లించి తమ సందేహాలను వెబ్ టెంప్లేట్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని బోర్డు సూచించింది.

 Read Also: హామీ 42%.. గెలిచింది 62%.. ‘మున్సిపోల్స్’లో రిజర్వేషన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>