బుద్దవనం సందర్శించిన ఉమ్మడి ఏపీ మాజీ ప్రధాన న్యాయమూర్తి

కలం, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ లోని బుద్ధవనంని (Buddhavanam) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వి.ఈశ్వరయ్య సతీసమేతంగా సందర్శించారు. సాగర్ సందర్శనలో భాగంగా విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి పెద్దవూర తాసిల్దార్ కాసీం, ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్ రెడ్డి, నిడమనూరు కోర్టు డిప్యూటీ నాజార్ శివ ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం వీరు బుద్ధవనం సందర్శించి బుద్ధ చరిత వనములోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. బుద్ధవనం సమావేశ మందిరంలో బుద్దవనం విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధజ్యోతులను వెలిగించిన అనంతరం బుద్దవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఆఫీసర్ రవిచంద్ర లు వీరికి బుద్దవనం కండువాలతో, బ్రోచర్లతో సత్కరించారు. అనంతరం వీరు నాగార్జునసాగర్ డ్యామ్ ను సందర్శించారు. వీరితోపాటు ఎస్ఐ సతీష్, టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>