యువతకు ఉగాది కానుక: జాబ్ క్యాలెండర్ విడుదల

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల సమయంలో, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఉద్యోగాల పండుగను ప్రకటించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్‌ (Job Calendar)ను ప్రభుత్వం విడుదల చేసింది. యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ జాబ్ క్యాలెండర్‌లో (Job Calendar) భాగంగా ఏయే తేదీల్లో నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారనే అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా, నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభ్యర్థుల సౌకర్యార్థం సిలబస్‌ను కూడా ముందుగానే ప్రకటిస్తామని వెల్లడించారు. ఇకపై ప్రతి ఏటా ఉగాది పండుగ నాడు ఉద్యోగాల ప్రకటన ఉంటుందని, ఇది నిరుద్యోగులకు నిరంతర అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు.

ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాలని, తద్వారా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అలర్ట్స్ పొందవచ్చని మంత్రి సూచించారు. ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చిందని, ఇక అభ్యర్థులు శ్రమించి పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఉద్యోగార్థులందరికీ ఆయన ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Also: పరాభవ నామ సంవత్సరం: పేరు విని భయపడొద్దు..!

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>