రైతుల ఖాతాల్లో డబ్బులు వేసిన ప్రభుత్వం

కలం, వెబ్ డెస్క్ : ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉగాది పండుగ సందర్భంగా అన్నదాత సుఖీభవ (Annadatha Sukhibhava) డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది ఏపీ గవర్నమెంట్. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద వేస్తున్న రూ.2వేలకు ఏపీ ప్రభుత్వం రూ.4వేలు కలిపి రూ.6వేలు రైతుల ఖాతాల్లో వేసింది. అసోంలోని గువహటిలో ప్రధాని నరేంద్ర మోడీ 22వ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను రిలీజ్ చేశారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని సూరంపల్లిలో అన్నదాత సుఖీభవ నిధులను రిలీజ్ చేశారు. మిగతా రాష్ట్రాల్లో రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2వేలు మాత్రమే జమ అయ్యాయి. కానీ ఏపీలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు కలిపి రూ.6వేలు రైతుల ఖాతాల్లో పడ్డాయి.

Read Also: అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>