అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం

కలం, వెబ్ డెస్క్ : అమరావతి (Amaravati) రాజధాని ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములుకు గౌరవార్థం భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా శాఖమూరు (Sakhamuru)లో నిర్మించిన ఈ విగ్రహం 58 అడుగుల ఎత్తుతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. “స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్” (Statue of Sacrifice) గా పేరుపొందిన ఈ విగ్రహాన్ని ఈ నెల 16న ఘనంగా ఆవిష్కరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు.

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) చేసిన నిరాహార దీక్ష, త్యాగం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ అమరావతిలో ఈ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషంగా భావిస్తున్నారు. ఈ విగ్రహం ఏర్పాటు ద్వారా కొత్త రాజధాని ప్రాంతంలో (Amaravati) చారిత్రాత్మక ప్రాధాన్యం మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Read Also: ప్ర‌కృతి సేద్యంతో అద్భుతాలు.. గుంటూరు రైతుకు సీఎం ప్ర‌శంస‌లు!

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>