Mobile Popup Ad
Mobile Popup Ad

టీడీపీ కౌన్సిలర్లపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సీరియస్

కలం, వెబ్ డెస్క్ : కాకినాడ (Kakinada) జిల్లా పిఠాపురంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడంతో పిఠాపురం (Pithapuram) మాజీ ఎమ్మెల్యే వర్మ (Ex MLA Varma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన వర్మ, వేదికపై ఉన్న ఫ్లెక్సీని గమనించి టీడీపీ కౌన్సిలర్లపై అసహనం వ్యక్తం చేశారు. “పార్టీలో ఇంత మంది కౌన్సిలర్లు ఉన్నారు.. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో ఉందో లేదో కూడా చూసుకోరా? ” అంటూ ప్రశ్నించారు.

“మా చంద్రబాబు(Chandrababu) ఫోటో లేనప్పుడు నేను వేదికపై ఎందుకు కూర్చోవాలి?” అంటూ వ్యాఖ్యానించిన వర్మ (Ex MLA Varma), వెంటనే కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అక్కడ కొంతసేపు చర్చనీయాంశంగా మారింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అయితే ఫ్లెక్సీపై చంద్రబాబు ఫోటో లేకపోవడం వల్ల జరిగిన ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

Read Also: అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>