ఇన్ సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని 2011 కు ముందు నియమితులైన ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) నిర్వహించేందుకు సర్కార్ అనుమతించింది.

సాధారణంగా ప్రతి సంవత్సరం నిర్వహించే రెండు టెట్ పరీక్షలకు అదనంగా మరో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పూర్తిగా సర్వీసుల్లో ఉన్న టీచర్ల (In-Service Teachers) ప్రయోజనాల కోసం ఈ పరీక్ష నిర్వహించనుంది.

ఈ ప్రత్యేక టెట్ నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్, ఎగ్జామ్ షెడ్యూల్, దరఖాస్తు విధానం తదితర వివరాలను పాఠశాల విద్యాశాఖ త్వరలో విడుదల చేయనున్నట్లు ఏపీటెట్ (AP TET) కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. అదనంగా మరో పరీక్ష నిర్వహించనుండడంతో టెట్ కు అర్హత సాధించేందుకు ఉపాధ్యాయులకు మరో అవకాశం లభించనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>