నేడు తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్

కలం, వెబ్ డెస్క్ : నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మీడియాతో మాట్లాడనున్నారు. తాడేపల్లి (Tadepalli) లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ వివాదం, పరకామణి వ్యవహారం, కాగ్ నివేదికతో పాటు రైతాంగ సమస్యలు, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై జగన్ స్పందించనున్నారు.

అలాగే ప్రభుత్వ విధానాలు, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) నిర్వహిస్తున్న ఈ మీడియా సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>