Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్ పర్యటన

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్  మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) నేడు ఢిల్లీ (Delhi) పర్యటనకు వచ్చిన సందర్భంగా తెలుగు దేశం పార్టీ ఎంపీలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేశ్ వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మెటా (Meta) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాట్సప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరంసదస్సులో ఆయన పాల్గొననున్నారు. డిజిటల్ గవర్నెన్స్‌, పౌరులకు అందించే సేవల్లో సాంకేతికత వినియోగం, ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా ప్రజలకు అందించే విధానాలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి.

ముఖ్యంగా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరవేయడం, పౌరులతో ప్రభుత్వ వ్యవస్థ నేరుగా కమ్యూనికేట్ కావడం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల ప్రతినిధులు, టెక్నాలజీ నిపుణులు, పాలసీ మేకర్లు పాల్గొని డిజిటల్ గవర్నెన్స్‌(Digital Governance) లో తాజా ఆవిష్కరణలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>