కలం, వెబ్ డెస్క్: భారత 29వ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ (Ashutosh Dixit) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన ఏపీ సింగ్ రిటైర్మెంట్ కావడంతో కేంద్ర ప్రభుత్వం అశుతోష్ దీక్షిత్‌ను వైమానిక దళాధిపతిగా నియమించింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి అయిన ఆయన 1986, డిసెంబర్ ఆరో తేదీన ఫైటర్ పైలట్‌గా ప్రస్థానం ప్రారంభించారు. నాలుగు దశాబ్ధాల కెరీర్లో అనేక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. ఫ్లైయింగ్, ఇన్‌స్ట్రక్టర్, టెస్ట్ పైలట్‌గా సుమారు 3,300 గంటల పాటు పనిచేసిన అనుభవం ఉంది.
మిరాజ్, మిగ్, జాగ్వార్ సహా అనేక యుద్ధ విమనాలను నడపడంలో అశుతోష్ దీక్షిత్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా కీలకంగా సేవలందించారు. అశుతోష్ దీక్షిత్ ముందు అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్‌కి సరిపడా యుద్ధ విమనాలను సకాలంలో సమకూర్చుకోవడం అందులో ప్రధానంగా ఉండనుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

