Mobile Popup Ad
Mobile Popup Ad

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారానికి చంద్ర‌బాబు!

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌ (Tamil Nadu Elections)కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం అన్ని పార్టీలు శ్ర‌మిస్తున్నాయి. ఇక ఎన్డీఏ త‌మిళ‌నాడులో ఈసారి ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్ల‌నున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో సీఎం చంద్ర‌బాబు త‌మిళ‌నాడులోని ప‌లు ప్రాంతాల్లో ప్రచారం చేయ‌నున్నారు. ఇందు కోసం రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరు బ‌య‌లుదేర‌నున్నారు.

తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉండే కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి తదితర ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా ఎన్డీఏ ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు, మోదీ నాయకత్వం ఆవశ్యకత, ఎన్డీఏ భాగ‌స్వామ్యంతో ఏపీ అభివృద్ధి నమూనాను వివరించనున్నారు. మ‌రి త‌మిళ‌నాడులో చంద్ర‌బాబు ప్ర‌చారం ఎన్డీఏకు ఏమాత్రం ప్ల‌స్ అవుతుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>