కలం, వెబ్ డెస్క్ : నేడు ఎనిమిదో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(AP Assembly Budget Session) కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్‌తో(Question Hour) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరును, విధానాలను ప్రశ్నిస్తూ వివిధ రంగాలపై స్పష్టత కోరతారు. ఈరోజు ప్రభుత్వం శాసనసభలో రెండు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లులకు సంబంధించి సభ్యులకు అవగాహన ఇచ్చే ప్రక్రియ కూడా మొదలవుతుంది. అలాగే శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ జరిపి ఆమోదం తెలుపనున్నారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ఆర్థిక వ్యయం, ఆదాయాల అంచనాలు, సామాజిక సంక్షేమ పథకాలకు మద్దతు వంటి అంశాలను ముఖ్యంగా పరిశీలించనున్నారు.


