బ్రిడ్జిపై నుంచి కింద‌ప‌డ్డ‌ ఆర్టీసీ బ‌స్సు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న‌ ఓ ఆర్టీసీ బ‌స్సు(RTC Bus) బ్రిడ్జిపై నుంచి కింద ప‌డింది. దీంతో బ‌స్సు డ్రైవ‌ర్‌తో స‌హా ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఉట్నూరు మండ‌లంలోని షాంపూర్ వద్ద నేడు ఉద‌యం ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బ‌స్సు క‌ల్వ‌ర్టును ఢీకొట్టి అదుపు త‌ప్పి వాగులో ప‌డిపోయింది. వెంట‌నే స్థానికులు అంబులెన్స్‌కు స‌మాచారం అందించారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 37 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. దాదాపు 30 మంది ప్ర‌యాణికుల‌కు గాయాల‌య్యాయి. బ‌స్సు ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>