Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్టుబడుల్లో నంబర్ వన్ అవ్వటమే మా లక్ష్యం : సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Chandrababu) సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం పలువురు కేంద్రమంత్రులను కలిసిన సీఎం చంద్రబాబు తాజాగా సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల్లో నంబర్ వన్ అవ్వటమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 22 నెలల్లో రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని తద్వారా 24 లక్షల ఉద్యోగాలను తీసుకురాగలినట్లు తెలిపారు.

అంతేకాదు భారత గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో 160 గిగా వాట్లాను.. ఏపీలోనే ఉత్పత్తి చేసేలా చూస్తామని చెప్పారు. ఏపీలో తొలిసారి విద్యుత్ కొనుగోళ్ల వ్యయాన్ని 30 పైసల మేర తగ్గించామన్న సీఎం చంద్రబాబు.. త్వరలోనే రూ.1.30 మేర వ్యయం తగ్గిస్తామని స్పష్టం చేశారు. దేవుడు అమరావతి రాజధానిని తీర్చిదిద్దే బాధ్యతను తనకు అప్పగించాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ నగరంగా అమరావతి నిర్మాణం ఉంటుందని .. నెట్ జీరో కాన్సెప్ట్ తో పనిచేస్తున్నామని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>