Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాచలం డిపోలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)  జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ (RTC Driver) ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. భద్రాచలం (Bhadrachalam) డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ డీ. లింగారెడ్డి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. పరిస్థితి విషమించడంతో  ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ముగ్గురు డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలు వెలుగులోకి రావడంతో ఈ సంఘటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది. వరుస ఘటనలపై ఆర్టీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>