కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని భగత్ నగర్లో ఉన్న వివేకానంద విద్యానికేతన్ విద్యాసంస్థల విద్యార్థులు ఎడోస్ ఐఐటీ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చాటారు. కూకట్ల సహస్ర 10వ ర్యాంకు, టి.భవిష్య 19వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా వారిని విద్యాసంస్థల ఛైర్మన్ కొమురయ్య సౌగాని అభినందించారు. రెండేళ్లుగా ఏఐ ఆధారిత బోధనను ఏడోస్ ఐఐటీ కరిక్యులంతో అందిస్తున్నామని వివరించారు. అందుకే, విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్టుల్లో ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు.

