కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు జీవో 60 ప్రకారం పూర్తిస్థాయి వేతనం చెల్లించాల్సిందేనని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి పి. సురేష్ డిమాండ్ చేశారు. కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం జీవో 60 అమలుకై ఇటీవల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరకు ఏఐటీయూసీ నేతలు నోటీసు అందజేశారు.
సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు గురువారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రాంగణంలోని AITUC కార్యాలయంలో “సాయి సెక్యూరిటీ సర్వీసెస్” ఏజెన్సీ నిర్వాహకులు, యూనియన్ నేతలు, కార్మికుల మధ్య ఉమ్మడి చర్చలు జరిగాయి. సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో కార్మికులకు యూనిఫార్మ్స్, సీనియర్ కార్మికులకు ప్రమోషన్స్, ఓటి డ్యూవ్ చెల్లింపులు తదితర సమస్యలు పరిష్కరిస్తామని జీతం సమస్యపై త్వరలోనే మళ్లీ తిరిగి మరోసారి చర్చించడానికి సమయం కావాలని ఏజెన్సీ వాళ్ళు కోరారు.
ఈ సందర్భంగా పి. సురేష్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల కాల వ్యవధితో ఏజెన్సీ ఎంపిక చేశారని కానీ ప్రభుత్వం ఏడాది గడిచిపోయిన కొత్త టెండర్ పాలసీని ఇప్పటికి ప్రకటించకపోవడం చేత కార్మికులకు జీతాలు పెరగడం లేదని, కనీసం జీవో 60 ప్రకారం ప్రస్తుత ఏజెన్సీ కాంట్రాక్టర్ పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం ఆసుపత్రిలో మిగతా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి 13600 రూపాయలు అందుతున్నాయని, కానీ వైద్య శాఖ ఉన్నత అధికారులు కార్మికులకు మోసం జరిగే విధంగా టెండర్ గైడెన్స్ రూపొందించడం చేత తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగిందని అన్నారు.
కనీసం అప్పటి టెండర్ గైడ్లైన్స్ లో ప్రకారం 12093 రూపాయలకు గాను 11,500 రూపాయలు మాత్రమే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి కార్మికులకు కొత్త టెండర్ పాలసీ వచ్చేవరకైన పూర్తిస్థాయి వేతనమైన అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కార్మికులకు దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సాయి సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ నిర్వాహకులు శ్రీవాణి, రాఘవేందర్, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ నేతలు కార్మికులు రంగన్న,బి.చెన్నయ్య, మొగులన్న, ఎస్.దేవానంద్, నరసింహ,నైసన్, అంజలయ్య, యుగంధర్ రెడ్డి, యాదయ్య,మన్యం, శంకర్,లోకేష్, నరసింహ, రాఘవేందర్, నరేష్,పద్మ, సత్యమ్మ,నాగమ్మ, సువర్ణ, చంద్రకళ,నాగమణి, లక్ష్మమ్మ,మల్లమ్మ, సునీత, బాలమణి,పద్మ,లక్ష్మి, చక్రి బాయ్, అరుణ, శ్యామల,చంద్రకళ, సంజన,సవిత తదితరులు పాల్గొన్నారు.

