‘జియో సైన్స్ ల్యాబ్‌’ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి!

కలం, ఖమ్మం బ్యూరో : సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను ఆధునికీకరించేందుకు కొత్తగూడెం కార్పొరేషన్ ఏరియాలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ‘జియో సైన్స్ లేబరేటరీ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka) మల్లు గురువారం ప్రారంభించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయనకు కలెక్టర్ అంకిత్ స్వాగతం పలికారు.​ అనంతరం ల్యాబ్‌లోని యంత్ర పరికరాలు, బొగ్గు నాణ్యత నిర్ధారణ సాంకేతికతను డిప్యూటీ సీఎం పరిశీలించగా.. పరీక్షా విధానాల ప్రాముఖ్యతను అధికారులు వివరించారు.

ఈ ల్యాబ్ ద్వారా ఖనిజ విశ్లేషణ వేగంగా, కచ్చితత్వంతో జరుగుతుందని, గనుల నిర్వహణకు సాంకేతిక సేవలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, సింగరేణి సి.ఎమ్.డి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ గౌతమ్ పొట్రూ, మేయర్ మూడ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>