కలం, వెబ్ డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ( Vizag Steel Plant Accident) లో జరిగిన ఘోర ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పైడి రాజు బుధవారం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. దీంతో ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది.
ఈ నెల 8న సాయంత్రం విశాఖ ప్లాంట్‌లో ఉక్కు ద్రవం కార్మికులపై పడటంతో 8 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా.. తాజాగా పైడి రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. కాగా, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 10 లక్షల చొప్పున కూటమి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ నేడు పరామర్శించనున్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లి నుంచి విశాఖకు బయలుదేరారు.

