Mobile Popup Ad
Mobile Popup Ad

దుబాయ్‌లో జగిత్యాల వాసుల మృతి.. మంత్రి పొన్నం దిగ్బ్రాంతి

కలం, కరీంనగర్ బ్యూరో: దుబాయ్‌ (Dubai) లో జగిత్యాల (Jagtial) జిల్లా వాసులు మృతిచెందడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండకి చెందిన సయ్యద్ సలీం, మెట్ పల్లి గాజులపేటకి చెందిన అబ్దుల్ రఫీక్, మల్యాల మండలం తక్కలపల్లికి చెందిన గోలపల్లి తిరుపతి మృతి చెందారు.

వీరి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఎన్నారై అడ్వైజరీ సెల్ ఛైర్మన్‌తో మాట్లాడారు. అక్కడి ఇండియన్ ఎంబసీతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలు స్వస్థలాలకు తీసుకురావాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>