Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి జిల్లాలో ప్రారంభమైన పోలీసుల యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్

​కలం, ఖమ్మం బ్యూరో: నిత్యం ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేసే పోలీస్ యంత్రాంగం.. అత్యవసర సమయాల్లో ఆయుధాలను ప్రయోగించడంలో మరింత నైపుణ్యాన్ని సాధించేందుకు సిద్ధమైంది. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్, హేమచంద్రపురం నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ వేదికగా పోలీసు అధికారులు, సిబ్బందికి వార్షిక తుపాకీ కాల్పుల శిక్షణ (యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్) ఘనంగా ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఆర్మడ్ రిజర్వ్ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.

​పోలీస్ శాఖలో ప్రస్తుతం వినియోగిస్తున్న వివిధ రకాల అత్యాధునిక ఆయుధాల పనితీరును, వాటిని క్లిష్ట సమయాల్లో ఎలా హ్యాండిల్ చేయాలనే అంశాలపై సిబ్బందికి ఈ శిక్షణలో అవగాహన కల్పిస్తున్నారు. కేవలం సిద్ధాంత పరంగానే కాకుండా, ప్రాక్టికల్‌గా టార్గెట్‌ను ఎలా ఛేదించాలనే దానిపై ఆర్మడ్ రిజర్వ్ నిపుణులు ప్రత్యేక మెలకువలను నేర్పుతున్నారు. వారం రోజుల పాటు నిరంతరాయంగా సాగే ఈ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో భాగంగా.. జిల్లా వ్యాప్తంగా ఉన్న సివిల్, ఏఆర్ విభాగాలకు చెందిన మొత్తం 1,469 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విడతల వారీగా హాజరుకానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>