కలం, సినిమా : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమర్షియల్ కథలకు తన స్టైల్ ఆఫ్ కామెడీ యాడ్ చేసి వరుస సూపర్‌హిట్స్ అందుకుంటున్నారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించింది. భారీగా కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది.
అనిల్ రావిపూడి ఇప్పటివరకు తన కెరీర్‌లో 9 సినిమాలు చేశారు. అనిల్ చేసిన ప్రతీ సినిమా మంచి విజయం సాధించింది. టాలీవుడ్ సీనియర్ హీరోలు అయిన వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవిలకు అనిల్ అదిరిపోయే కంబ్యాక్ మూవీలను అందించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన 9 సినిమాలలో బాలకృష్ణతో చేసిన “భగవంత్ కేసరి” (Bhagavanth Kesari) అంటే ఇష్టమని తెలిపారు. అప్పటి వరకు తాను చేసిన సినిమాలన్నింటిలో భగవంత్ కేసరి భిన్నంగా ఉంటుంది. ‘బనావో భేటీకో షేర్’ అనే కొత్త కాన్సెప్ట్‌తో చేసిన ఆ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు తీసుకురావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అనిల్ (Anil Ravipudi) అన్నారు.
Read Also: వివాదంపై స్పందించిన ఏఆర్ రెహమన్
Follow Us On: Sharechat


