కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ (TMSRU) సీఐటీయూ ఆధ్వర్యంలో ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన సంతోష్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. శనివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సంతోష్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబానికి రూ.75 వేల ఆర్థిక సాయం అందజేశారు. జూలై 7వ తేదీన విధుల్లో ఉండగానే ఆకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. సంతోష్ కుటుంబానిక టీఎంఎస్ఆర్‌యూ యూనియన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్, భాను ప్రకాష్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు శోభన్ యాదవ్, సీఐటీయూ రాష్ట్ర నాయకులకు కిళ్లే గోపాల్, జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, మురళీధర్ రెడ్డి, రమేష్, ఇమ్రాన్, శివ, నాగరాజు, తదితరుల పాల్గొన్నారు.

