హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్ తరలింపు

కలం, హనుమకొండ: హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్‌ (Women Police Station)ను భీమారానికి తరలించారు. ఇప్పటివరకు సుబేదారిలోని పోలీస్ స్టేషన్‌ పై అంతస్తులో కొనసాగుతున్న మహిళా పోలీస్ స్టేషన్‌ను భీమారంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ భవనంలోకి మార్చారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి నూతన భవనంలోనే మహిళా పోలీస్ స్టేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మహిళలు, ఫిర్యాదుదారులకు సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఈ మార్పునకు నిర్ణయం తీసుకున్నారు.

ఇబ్బందిగా ఉండటంతో..

సుబేదారి స్టేషన్ పై అంతస్తులో మహిళా పోలీస్ స్టేషన్ నిర్వహణకు అవసరమైన స్థలం సరిపోకపోవడం, కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాలమైన ప్రాంగణం ఉన్న భీమారం పోలీస్ క్వార్టర్స్ భవనాన్ని కమిషనర్ ఎన్.శ్వేత ఎంపిక చేశారు. కొత్త ప్రాంగణంలో మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు సర్వోదయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ కలహాలు, దాంపత్య సమస్యలు, ఇతర కుటుంబ వివాదాల పరిష్కారానికి ఈ కేంద్రం ద్వారా కౌన్సెలింగ్ సేవలు అందించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>