కలం, వెబ్ డెస్క్: అనిల్ రావిపూడి.. విజయవంతమైన టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరు. ఈ డైరెక్టర్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో విజయాలు నమోదు చేశాడు. రాజమౌళి తర్వాత, ఆ స్థాయిలో సక్సెస్‌లు అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడినే (Anil Ravipudi). ఈ ఏడాది ప్రారంభంలోనే ‘సంక్రాంతికి వస్తున్నం’ మూవీతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
అలాగే ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్, ఇతర నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా భారీగానే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. గేమ్ ఛేంజర్ మూవీతో భారీగా నష్టపోయిన నిర్మాత దిల్ రాజుకు భారీ విజయాన్ని అందించింది. అలాగే ‘భగ్వంత్ కేసరి’ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. ప్రేక్షకులను నవ్వించే కుటుంబ వినోద చిత్రాలను రూపొందించడంలో అనిల్ రావిపూడికి (Anil Ravipudi) మంచి పట్టుంది.
మరోసారి తన హిట్ ఫార్ములాతోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ సంక్రాంతి (Sankranti)కి విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, లుక్స్ అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించడం అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విపరీతమైన బజ్‌ను సృష్టిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో ముందంజలో ఉంది. హిట్ మెషీన్ నుంచి మరో పండుగ బ్లాక్‌బస్టర్‌గా రాబోతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Read Also: పెద్ది నుంచి జగపతి బాబు లుక్ రిలీజ్.. ఇలా ఉన్నాడేంటి..
Follow Us On: Instagram


