కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన స్టైల్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఫార్ములాతో అనిల్ వరుస సూపర్‌హిట్స్ అందుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara VaraPrasad Garu). సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది.
తనకి వరుస సూపర్‌హిట్స్ అందిస్తున్న తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు అనిల్ భోగి శుభాకాంక్షలు చెబుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఏకంగా 6 సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు వెల్లడించారు. మెగాస్టార్‌తో తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ కేవలం రెండు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిందని అనిల్ వెల్లడించారు. దీనితో ఈ సంక్రాంతి తనకెంతో స్పెషల్ గా మారిందని అనిల్ (Anil Ravipudi) పేర్కొన్నారు.
Read Also: 18 కిలోలు తగ్గిన అమీర్ ఖాన్, ఎందుకో తెలుసా
Follow Us On: Sharechat


