కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తరువాత వచ్చిన దేవర (Devara) సినిమాతో తన కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే గత ఏడాది ‘వార్ 2′ (War 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్షన్‌లో ‘డ్రాగన్’ (Dragon) అనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేస్తున్నారు.
సలార్ (Salaar) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని ఈ ఏడాది గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ (Anil Kapoor) జాయిన్ అయ్యారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. అనిల్ కపూర్ రాకతో ‘డ్రాగన్’ మూవీకి మరింత హైప్ వచ్చింది.
Read Also: క్రేజీ టైటిల్‌తో పూరి మూవీ.. హైవోల్టేజ్ లుక్‌లో విజయ్ సేతుపతి


