కలం, వెబ్ డెస్క్: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రారంభమై చాలారోజులైనా ఒక్క అప్డేట్ బయటకు రాలేదు. ఎట్టకేలకు శుక్రవారం ఆసక్తికరమైన అప్డేట్‌ను మూవీ టీం షేర్ చేసింది. విజయ్ సేతుపతి పుట్టినరోజును పురస్కరించుకుని ‘స్లమ్ డాగ్’ (33 టెంపుల్ రోడ్) ట్యాగ్‌లైన్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కరెన్సీ కట్టలు, పగిలిన పెట్టెలు, రక్తపు మరకలు, చేతిలో కత్తి పట్టుకొని భయంకరమైన లుక్ (Look)లో విజయ్ సేతుపతి కనిపిస్తాడు. విజయ్ సేతుపతిని పూరి ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నాడు. పూరి జగన్నాథ్, చార్మి కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ అధినేత జెబి నారాయణరావుతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తుంది. ప్రముఖ నటులు టబు, విజయ్ కుమార్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ హైవోల్టేజ్ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్ మూవీకి జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.


