కలం, వెబ్ డెస్క్: టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విషయంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ జహీర్‌ఖాన్ (Zaheer Khan)ను ఎంపిక చేసింది. కొత్త సీజన్ ప్రారంభానికి ముందు జహీర్ ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. ట్రాయ్ కూలీ స్థానాన్ని భర్తీ చేస్తూ, బౌలర్లను తయారు చేసే బాధ్యతను బోర్డు ఆయనకు అప్పగించింది. ప్రస్తుతం భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ల కొరత వేధిస్తున్న తరుణంలో, జహీర్ ఖాన్ వంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని బీసీసీఐ భావిస్తోంది. ఫిబ్రవరి 28 నుండి మార్చి 2 వరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో నిర్వహించే ప్రత్యేక క్యాంపును జహీర్ పర్యవేక్షించనున్నారు. వివిధ రాష్ట్రాల నుండి ఎంపిక చేసిన యువ బౌలర్లకు ఆయన శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో CoE క్రికెట్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా పాలుపంచుకోనున్నారు.
ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించిన జహీర్ (Zaheer Khan), కోచింగ్ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ పూర్తిస్థాయి బాధ్యతలకు కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరిస్తే, భారత జట్టు సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి పనిచేస్తూ భవిష్యత్తు ఐసీసీ టోర్నీల కోసం బలమైన బౌలింగ్ విభాగాన్ని నిర్మిస్తారు. జహీర్ ఖాన్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకరు. తన కెరీర్‌లో 309 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆయన 610 వికెట్లు పడగొట్టారు. అత్యధిక వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్‌గా ఆయన పేరిట రికార్డు ఉంది. అటువంటి దిగ్గజం శిక్షణలో యువ బౌలర్లు మెరుగులు దిద్దుకోవడం భారత క్రికెట్‌కు శుభపరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియామకంపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Read Also: సూర్యకుమార్ బ్యాటింగ్‌పై ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Instagram

