Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్ .. గెజిట్ విడుదల

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసాగిల్‌ (Lisa Gill) నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేసింది. కాగా, హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. శనివారం జస్టిస్‌ లీసాగిల్‌ ఏపీ హైకోర్టు సీజేగా వ్యవహరించనున్నారు. దీంతో ఏపీ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ చరిత్రకెక్కనున్నారు.

జస్టిస్ లీసా గిల్ నియామకంపై ఏపీ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ నియామకానికి ముందు జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హర్యానా కోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. కోలీజియం సిఫార్స్ మేరకు ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు.

Read Also: కార్పొ’రేట్’ వైద్యం.. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>