కలం, వెబ్ డెస్క్: వాలెంటైన్స్ డే (Valentines Day) వస్తోందంటే కేవలం గులాబీల పరిమళం మాత్రమే కాదు, సైబర్ నేరగాళ్ల ‘ప్రమాద ఘంటికలు’ కూడా మోగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్‌లో తోడు కోసం వెతికే ఒంటరి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు వల విసురుతున్నారు. ప్రేమ నటిస్తూ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అపరిచితులతో ఆన్‌లైన్ స్నేహం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ (Hyderabad CP) సజ్జనార్ ట్విట్టర్ వేదికగా సూచించారు.
పరిచయమైన వెంటనే ‘ఐ లవ్ యూ’ చెప్పడం, విదేశాల్లో ఉన్నామంటూ గొప్పలు చెప్పడం, హఠాత్తుగా ఆపద వచ్చిందని నాటకాలాడటం.. ఇవన్నీ మిమ్మల్ని బుట్టలో వేసుకునే ఎత్తుగడలేనని’’ అని ఆయన ట్వీట్ చేశారు. అజ్ఞాత వ్యక్తులకు డబ్బులు, గిఫ్ట్ కార్డులు పంపొద్దన్నారు. వీసా సమస్యలు, ఆసుపత్రి ఖర్చులు, కస్టమ్స్‌లో ఖరీదైన ‘గిఫ్ట్’ ఇరుక్కుపోయిందంటూ చెప్పే మాయమాటలు అస్సలు నమ్మొదన్నారు. అనుమానం వస్తే వెంటనే స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నారు. ప్రేమ కోసం మోసగాళ్ల చేతిలో చిక్కి విలపించొద్దని, జాగ్రత్త ఉండాలని సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) సూచించారు.
Read Also: రైతుల కోసం దేనికైనా సిద్ధం: రాహుల్ గాంధీ
Follow Us On: X(Twitter)


