epaper
Wednesday, February 18, 2026
epaper

ఫోన్ వాడొద్దని మందలించిన తల్లి.. ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: ఈతరం పిల్లల్లో ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు వద్దని చెప్పినా వినడం లేదు. ఫోన్ పిచ్చితో ఒక్కోసారి ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌ (Jharkhand)లోని లాతేహార్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ మితిమీరి వాడుతుందన్న కారణంతో తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన 20 ఏళ్ల యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఛిపాదోహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్తోలా గ్రామంలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది.

యువతి స్మార్ట్‌ఫోన్‌ (Mobile Phone)కు బానిసైందని, ఆ విషయంలో గొడవ జరగడంతో ఇంటి నుండి బయటకు వెళ్లి చెట్టుకు దుపట్టాతో ఉరివేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఇది ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఫోన్‌కు బానిసవ్వడం యువత ప్రాణాల మీదకు తెస్తుందనడానికి ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలుస్తోందని పోలీసులు చెప్తున్నారు.

 Read Also: రూ.57 లక్షలతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ జంప్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>