కలం, వెబ్ డెస్క్: ప్రముఖ పాటల రచయిత అనంత్ శ్రీరామ్(Anantha Sriram) పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. భీమవరం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తన ఇంటి ముందున్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాశ్ ఆక్రమించారని పేర్కొన్నారు. ఈ స్థల వివాదం కోర్టులో ఉన్నప్పటికీ సూర్య ప్రకాశ్ తమను బెదిరిస్తున్నారని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, వారికి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందించారు. అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: అత్యవసర ప్రయాణం.. టికెట్ లేకున్నా ట్రైన్‌లో వెళ్లొచ్చా? రైల్వే రూల్స్ ఇవే
Read Also: మన గుడులు.. మన సంస్కృతి

