Mobile Popup Ad
Mobile Popup Ad

రాజమండ్రి కోర్టుకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు

కలం, వెబ్ డెస్క్ : దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Ananta Babu) రాజమండ్రి కోర్టుకు హాజరయ్యారు. సాక్షులపై బెదిరింపులకు దిగుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉల్లంఘించారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు. ఈ మేరకు అతడి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై రాజమండ్రి కోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో అనంతబాబు కోర్టులో తన వాదనలు వినిపించనున్నారు.

కాగా, నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తనపై సర్పవరం పీఎస్‌లో నమోదైన తాజా (సాక్షుల బెదిరింపు) కేసును కొట్టివేయాలని కోరుతూ అనంతబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>