ఆడుకుంటుండగా వంట పాత్రలో ఇరుక్కున్న బాలుడు.. చివరికి!

కలం, వెబ్‌డెస్క్: కేరళ (Kerala) లో ఓ బాలుడు వంట పాత్రలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అల్యూమినియం పాత్రలో ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన బాలుడి తల్లిదండ్రులు ఆ చిన్నారిని పాత్రలో నుంచి తీసేందుకు ప్రయత్నించగా ఎంతకూ రాకపోవడంతో ఫైర్ అండ్ రెస్క్యూ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు పాత్రను కట్‌చేసి ఇరుక్కుపోయిన బాలుడిని బయటకు తీశారు. చిన్నారుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎప్పుడూ వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కొన్నిసార్లు పిల్లలు ఆడుకునే వస్తువులు వారిని ప్రమాదానికి గురిచేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు వారిని ఒంటరిగా వదిలేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కడ ఆడుకుంటున్నారు, ఎటువంటి వస్తువులతో ఆడుకుంటున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచిస్తున్నారు. టాబ్లెట్లు, కరెంట్ సాకెట్లు, ప్రమాదకరమైన వస్తువులకు పిల్లలు దూరంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

Read Also: గల్ఫ్ కార్మికులపై యుద్ధం ఎఫెక్ట్.. విమాన చార్జీలకు రెక్కలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>