కలం, వెబ్ డెస్క్: ఒడిశాలోని (Odisha) డెంకానాల్ జిల్లాలో గురువారం తీవ్ర విషాద ఘటన జరిగింది. పెళ్లి బృందం కారు అదుపుతప్పి చెరువులోకి (Car Plunges Into Pond) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు చెరువువద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

