epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘ఓట్ చోరీ’కి ఆజ్యం పోసిందే నెహ్రూ

కలం డెస్క్ : రాహుల్‌గాంధీ ఇటీవల తరచూ ప్రస్తావిస్తున్న ఓట్ చోరీ (Vote Chori) అంశంపై లోక్‌సభలో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ (Election Comission of India) సంస్కరణలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతుండగా రాహుల్‌గాంధీ (Rahul Gandhi) జోక్యం చేసుకుని ఓట్ చోరీ అంశంపై తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తాను ప్రెస్ కాన్ఫరెన్సులో ఆధారాలతో సహా చూపించిన అంశాలపై వివరణ ఇవ్వాలన్నారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన అమిత్ షా… వ్యక్తుల సవాళ్ళు, డిమాండ్లతో సభ నడవదని, నిబంధనల ప్రకారమే నడుస్తుందని రిప్లై ఇచ్చారు. అనంతరం ఈ దేశంలో మొట్టమొదట ఓట్ల చోరీకి పాల్పడింది తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

నెహ్రూతో మొదలైన ఓట్ చోరీ :

ప్రధానిగా ఎవరుండాలనే అంశంలో పార్టీపరంగా నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రావిన్స్ నేతల ఓటింగ్ అవసరమనే డెసిషన్ జరిగింది. మొత్తం 30 మంది ఓట్లు వేస్తే కేవలం రెండు మాత్రమే నెహ్రూకి (Jawaharlal Nehru) వచ్చాయని, మిగిలిన 28 ఓట్లు సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు (Sardar Patel) వచ్చాయని, కానీ చివరకు నెహ్రూ నెగ్గినట్లు ప్రకటన వెలువడిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ (Indira Gandhi) సైతం రాయబరేలీ (Raibareli) నుంచి గెలిచినప్పుడు ఓటింగ్ గోల్‌మాల్ జరిగిందంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయిందని, విచారణ అనంతరం ఆ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు తీర్పు వెలువడిందన్నారు. ఇది రెండో అతి పెద్ద ఓట్ చోరీ అని అన్నారు. చివరకు ప్రధాని గెలుపును ఎవ్వరూ న్యాయస్థానాల్లో సవాలు చేయకుండా ఒక చట్టాన్ని ఆమె తీసుకొచ్చారని, ఇది ఓట్ చోరీ ప్రక్రియ బహిర్గతం కాకుండా ఉండేందుకేనని షా (Amit Shah) అన్నారు.

Read Also: గ్యారేజ్ నుండి గ్లోబల్ దిగ్గజం వరకు.. గూగుల్ విజయగాథ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>