కలం, వెబ్ డెస్క్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) హెలికాప్టర్ (Helicopter)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల అస్సాం రాష్ట్రంలోని దుబ్రి జిల్లా గోలక్ గంజ్ లో నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచార ర్యాలీ రద్దైంది. నేడు (శుక్రవారం) సాంకేతిక సమస్యల కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్ అధికారులు అనుమతి లభించలేదు. ఈ నెల 9వ తేదీన అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ మరోసారి ఆ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కాషాయ అగ్రనేతలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే నేడు అమిత్ షా (Amit Shah ) అస్సాంలో ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. హెలికాప్టర్ సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ల్యాండ్ చేయలేకపోవడంతో షా తన ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఫోన్ ద్వారా మద్దతుదారులతో మాట్లాడి తగిన సూచనలు చేశారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా దుద్నోయ్ లో నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లారు. కాగా, హెలికాప్టర్ (Helicopter ) లో సాంకేతిక సమస్య తలెత్తడంపై అధికార వర్గాలు స్పందించాయి. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని, సాంకేతిక సమస్య మాత్రమేనని స్పష్టం చేశాయి.

