కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ నిర్మాత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంబికా కృష్ణ (Ambika Krishna) తాజాగా టాలీవుడ్ హీరోల వైఖరిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తమ మనుగడకు కారణమైన ఏపీ ప్రాంతాన్ని తెలుగు హీరోలు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు టాలీవుడ్ హీరోల వైఖరిని తప్పుబడుతూ పలు ఆసక్తికరమైన, ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరూ తమ కెరీర్ ప్రారంభంలో మొదటి ముద్ద ఆంధ్రప్రదేశ్‌లోనే తిన్నారని, ఇక్కడ ప్రేక్షకుల ఆదరణతోనే నేడు పెద్ద స్టార్లయ్యారని అంబికా కృష్ణ గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం హీరోలు, నిర్మాతలు సినిమాల షూటింగ్‌ల కోసం విదేశాలకు , ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నారనే తప్ప, తమ సొంత రాష్ట్రమైన ఏపీలో మాత్రం సినిమాలు తీయడం లేదని ఆయన (Ambika Krishna) ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఇకనైనా హీరోలు తమ ప్రతి సినిమాలో కనీసం ఒక్క షెడ్యూల్ అయినా ఏపీలో జరిగేలా ప్లాన్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రస్తుత సినిమాల్లో కేవలం కొన్ని ప్రాంతాల యాసలకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. టాలీవుడ్ చిత్రాల్లో క్రమంగా ఆంధ్ర ప్రాంతపు యాస, సంస్కృతి కనుమరుగు అవుతుందని వ్యాఖ్యానించారు.
Read Also: 2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

