Mobile Popup Ad
Mobile Popup Ad

రికవరీ బంగారాన్ని చోరీ చేసిన ఎస్సై

బెట్టింగ్‌ యాప్‌కు బానిసైన ఓ ఎస్సై ఏకంగా పోలీస్ స్టేషన్‌లో రికవరీ చేసిన బంగారాన్ని చోరీ చేశాడు. అంబర్ పేట(Amberpet) పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీస్ శాఖలో ఈ ఘటన సంచలనంగా మారింది. భాను ప్రకాశ్ అంబర్‌పేట పీఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. బెట్టింగ్ యాప్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పులపాలయ్యాడు. చివరకు స్టేషన్‌లో రికవరీగా ఉన్న బంగారాన్ని దొంగించాడు.

భాను ప్రకాశ్ గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో బాగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఒకసారి డబ్బు గెలవడంతో మళ్లీ మళ్లీ పెద్ద మొత్తాల్లో బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి , చివరకు లక్షల రూపాయలు కోల్పోయాడు. అప్పులు పెరుగుతుండడంతో రికవరీ ఏజెంట్ల ఒత్తిడి తప్పించుకునే పరిస్థితి లేకపోయింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా అప్పులు తీర్చేందుకు స్టేషన్‌లో ఉన్న రికవరీ బంగారం మీద కన్నేశాడు.

అంబర్‌పేట్(Amberpet) పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో రికవరీ చేసిన బంగారం భద్రపరిచారు. ఈ బంగారాన్ని ఎవరూ అనుమానించకుండా వాడుకోవచ్చని భావించిన భాను ప్రకాశ్, లాకర్‌లోని బాక్స్‌ను తెరిచి సుమారు ఐదు తులాల బంగారం తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ బంగారం విలువను ఉపయోగించి అప్పుల్లో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. స్టేషన్ రికార్డులు, కేసు ఫైళ్ల పరిశీలిస్తుండగా రికవరీ బంగారం గణాంకాల్లో తేడాలు కనిపించాయి. ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో అంతర్గత విచారణ ప్రారంభమైంది. సీసీటీవీ ఫుటేజీలు, రికార్డుల పరిశీలనలో భాను ప్రకాశ్ బంగారం చోరీ చేసినట్టు వెల్లడైంది.

విచారణ రిపోర్ట్ ఆధారంగా భాను ప్రకాశ్‌ను డ్యూటీల నుండి తప్పించి, శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. రికవరీ బంగారం దొంగిలించడం తీవ్రమైన నేరం కావడంతో, క్రిమినల్ కేసు నమోదుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు.

Read Also: తెలంగాణ పేరు మార్చాల్సి వస్తుందేమో: హైకోర్టు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>