epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పవన్ కల్యాణ్ డ్యాన్స్‌పై అంబటి రాంబాబు సెటైర్లు

కలం వెబ్ డెస్క్‌ : సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురంలో (Pithapuram) జ‌రిగిన వేడుక‌ల్లో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ వేడుక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన‌ డ్యాన్స్‌పై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు (Ambati Rambabu) సెటైర్లు వేశారు. ఎక్స్ వేదిక‌గా చేసిన ఓ పోస్ట్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శించారు. “సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా? మరి పవన్ డాన్స్ వేస్తే?” అంటూ అంబటి రాంబాబు త‌న పోస్టులో పేర్కొన్నారు. పోస్ట్‌లో పవన్ కల్యాణ్ పేరు ట్యాగ్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గ‌తంలో అంబ‌టి మంత్రిగా ఉన్న‌ప్పుడు సంక్రాంతి సంద‌ర్భంగా జ‌రిగిన వేడుక‌ల్లో డ్యాన్స్ చేశారు. అప్పుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోలింగ్ జ‌రిగింది. సంబ‌రాల రాంబాబు అంటూ నెటిజ‌న్లు, జ‌న‌సేన, టీడీపీ కార్య‌క‌ర్త‌లు కామెంట్లు చేశారు. ఆ సంఘ‌ట‌న‌ను గుర్తు చేస్తూ అంబ‌టి (Ambati Rambabu) తాజా పోస్ట్ చేశారు. దీనిపై నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు.

Read Also: ఇరుసుమండ‌లో అదుపులోకి వ‌చ్చిన మంట‌లు

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>