రాజ్యసభకు అమరావతి చట్టబద్ధత బిల్లు.. నేడు చర్చ!

కలం, వెబ్ డెస్క్: అమరావతి చట్టబద్ధత బిల్లు (Amaravati Legitimacy Bill)పై గురువారం రాజ్యసభలో చర్చించనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై మధ్యాహ్నం ఒంటిగంటకు రాజ్యసభలో చర్చ జరగనుంది. బిల్లుపై రాజ్యసభలో (Rajya Sabha) గంటపాటు చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తరువాతే బిల్లుకు ఆమోదం లభించనుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి బిల్లును పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బుధవారం అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ (Minister Nityanand Rai) ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సుమారు సుమారు రెండు గంటలపాటు చర్చ జరిగిన తర్వాత లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం అమరావతి చట్టబద్దత బిల్లును (Amaravati Bill) ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేశారు.

Read Also: ఫేస్‌బుక్ ప్రేమ పెళ్లి విషాదాంతం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>