నేడు రాజధాని రైతులతో జగన్ కీలక భేటీ

కలం, వెబ్ డెస్క్ : అమరావతి(Amaravati) రాజధాని ప్రాంత రైతులు నేడు (జూన్ 2) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ని (YS Jagan) కలవనున్నారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా తొలి విడతలో కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు, రెండో విడత భూసేకరణ అంశాలతో పాటు రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను జగన్‌కు వివరించనున్నారు.

భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం, రాజధాని అభివృద్ధి పనుల పురోగతి వంటి విషయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, అమరావతి నిర్మాణాలలో అవినీతి జరిగిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు జగన్‌తో నిర్వహించనున్న భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>