Mobile Popup Ad
Mobile Popup Ad

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు: నేడే ప్రమాణస్వీకారం!

కలం, వెబ్ డెస్క్ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో నేడు నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో పాటు ఒక సీనియర్ న్యాయవాది నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశ ప్రధాన న్యాయమూర్తి (CJI) వీరి చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ అరుణ్‌పల్లి సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమాణం చేయనున్నారు. వీరితో పాటు సుదీర్ఘ న్యాయ అనుభవం ఉన్న సీనియర్ అడ్వొకేట్ సుబ్రమణి కూడా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం, కొలీజియం సిఫార్సుల అనంతరం ఈ నియామకాలు జరిగాయి. ఈ కొత్త నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల కొరత కొంతమేర తీరడమే కాకుండా, పెండింగ్ కేసుల పరిష్కారం మరింత వేగవంతం కానుంది. ఈ కార్యక్రమానికి న్యాయరంగ ప్రముఖులు, సీనియర్ న్యాయవాదులు హాజరుకానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>