Mobile Popup Ad
Mobile Popup Ad

అమరావతి కోసం మరో రూ.2,100 కోట్లు విడుదల

కలం, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి (Amaravati) పై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి అభివృద్ధి నిర్మాణ పనుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుండి రూ. 2,100 కోట్లను సీఆర్‌డీఏకు (CRDA) విడుదల చేసింది. రాజధాని నిర్మాణాల కోసం వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.6,000 కోట్లను కేటాయించింది.

ఇందులో భాగంగా గతంలోనే అమరావతి పనుల నిమిత్తం రాష్ట్ర ఖజానా నుండి రూ. 2,100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా మరో రూ.2,100 కోట్ల విడుదల చేసింది. ఈ మేరకు న‌గ‌దు విడుద‌ల‌కు పరిపాలనా అనుమతి మంజూరు జారీ చేస్తూ ప్ర‌భుత్వం కూటమి ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని కూటమి ప్రభుత్వం వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>